రాజేందర్ రెడ్డి  కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


విద్యుత్ షాక్ తో మృతి చెందిన  ఎడ్ల రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను మంగళవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.

పెగడపల్లి  మండలం నంచర్ల గ్రామానికి చెందిన ఎడ్ల రాజేందర్ రెడ్డి విద్యుత్ షాక్ తో  మృతి చెందిన సమాచారంతో ఎమ్మెల్యే, రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు . రాజేందర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటానని కుటుంబ సభ్యులకు వివరించి మనో ధైర్యం కల్పించారు.

విద్యుత్ అధికారులతో మరియు కలెక్టర్ తో ఫోన్ ద్వారా సంఘటన వివరాలు వివరించి  కుటుంబానికి త్వరితగతిన ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వీధులలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

👉 మానవత్వం చాటుకున్న ప్రభుత్వ విప్ !

హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి వస్తున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు
సిద్ధిపేట జిల్లాలో గౌరారామ్ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తించారు.

తన వాహనం నిలిపి, క్షతగాత్రులను వాహనం నుంచి బయటికి తీశారు వారిని పరామర్శించి ఓదార్చారు. అంబులెన్స్ కు ఫోన్ చేసి వారిని  ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్ ACP కీ చేసి అప్రమత్తం చేస్తూ వారికి  మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

👉 కార్యకర్త ఇంటికి..

ధర్మారం మండలం కటికనపల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్  కార్యకర్త నరేష్  సంవత్సరీకం సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  వారి ఇంటికి వెళ్లి నరేష్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.