👉ఈ నెల 3 నుండి 11 వరకు..
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శనివారం తెల్లవారుజామున నుంచి ప్రారంభం కాన్నాయి.

👉 ఈ నెల 3 నుండి 11- వరకు నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి.
శనివారం ఉదయం 6-00 గం॥లకు మంగళ వాయిద్యములతో గోదావరి నది నుండి పవిత్ర జలాలు అర్చకులు తీసుకువస్తారు.
👉 ఉదయం 8 గం॥లకు పుణ్యాహవచనము, ఋత్విక్వరణము, కలశస్థాపన, అభిషేకము, సాయంత్రం 5 గం॥లకు వేదోక్తముగా సహస్ర కలశస్థాపన, నవగ్రహ యోగిని, వాస్తు, క్షేత్రపాలక స్థాపనలు అర్చనాది ఆరాధనా కార్యక్రమము నిత్య హోమములు జరుగుతాయి.
👉 ఉత్సవాలలో ప్రధానమైనవి.
👉 మే 7 న బుధవారం సహస్ర కలశోదకములతో స్వామి వారికి అభిషేకము !
👉 మే 8 న గురువారం రోజున స్వామి వారికి చందనోత్సవము నిర్వహించబడును,
👉 మే 9 న శుక్రవారం ఉదయం అన్నకూటోత్సవము, సాయంత్రం గోధూళి సుముహూర్తమున వసంతోత్సవము మరియు పల్లవోత్సవము, నిర్వహించబడతాయి.
👉 మే 10 న శనివారం లక్ష తులసీ అర్చన వైభవముగా జరుగుతాయి..
👉 మే 11 న ఆదివారం నృసింహ జయంతి ఉత్సవం, సాయంకాలం స్థంభోద్భవలో స్వామివారికి విశేషపూజలు జరగనున్నాయి.
👉 స్వామివారి నవరాత్రి ఉత్సవాలలో..
ఆలయ ప్రాంగణంలో ప్రతినిత్యము లక్ష్మీ సూక్త సంపుటీకరణము, లలిత, విష్ణు సహస్రనామ పారాయణము జరుగును.

నృసింహ నవరాత్రోత్సవములను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ మరియు అనుబంధ ఆలయములకు పూల అలంకరణతోపాటు భక్తులకు తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేపట్టారు