👉 భూ సమస్యలపై రైతులతో మాట ముచ్చట !
👉 భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన బుగ్గారం లో సభ !
👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సభా స్థలం వేదిక అధికారులతో కలిసి పరిశీలన !
J.SURENDER KUMAR,
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శనివారం బుగ్గారం మండల కేంద్రంలో నిర్వహించే భూ భారతి సమావేశంలో పాల్గొననున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ ఎస్పీలతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సభా స్థలం, వేదిక ఏర్పాట్లు శుక్రవారం పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
👉 గత బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో పోర్టల్ తెచ్చి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ధరణి నీ రద్దుచేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా భూ భారతిని చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున అమలులోకి తెచ్చిందన్నారు.

👉 భూ భారతి చట్టం అమలులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు.
👉 గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో ధరణి కారణంగా భూమికి సంబంధించి రైతాంగానికి జరిగిన భూ నష్టాన్ని, సమస్యలు, రికార్డులలో పొరపాట్లు ఉంటే , వాటిని సరిచేసుకునే అవకాశం ఆర్డీవో ,ఎమ్మార్వో కు అధికారం ఉండేది కాదని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి ద్వారా అధికారులు, ప్రజల ద్వారా నేరుగా దరఖాస్తులు తీసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.

👉 భూభారతి చట్టంలో మరింత వేసులుబాటు తో అమలు చేయడానికి రైతాంగ నుండి సలహాలు, సూచనలు సలహాలు నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుగ్గారం మండలానికి ఉదయం 9 గంటలకు రానున్నారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 కావున ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు, పాల్గొని సలహాలు, సూచనలు మంత్రికి, కలెక్టర్ కు, ఆర్డీవోకు తాసిల్దార్ కు నిర్భయంగా చెప్పాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు