ఆర్ఎంపిల సంఘ అధ్యక్షుడు గా నరేష్ !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా ధర్మపురి మండల  ఆర్ఎంపీ ,పిఎంపి ల సంఘ అధ్యక్షుడిగా ధర్మపురి పట్టణానికి చెందిన వేముల నరేష్ ఎన్నికయ్యారు.


ధర్మపురి పట్టణంలోని ఆర్ఎంపీ,పిఎంపిల వంక భవనంలో ఆదివారం జిల్లా బాద్యులు సమక్షంలో ఎన్నికలు జరిగాయి.


  అధ్యక్షుడిగా  వేముల నరేష్, ప్రధాన కార్యదర్శి  ఒడ్డెటి నరేష్, కోశాధికారి  కడారి గంగాధర్ లు  ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు అలనేని రాజేశ్వర్ రెడ్డి జిల్లా కోశధికారి. కంది చంద్రశేఖర్ రావు. జోనల్ అధికార ప్రతినిధి .కుసుమ శంకర్
జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అకుల నాగరాజు, తదితరులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. నరేష్ ఎన్నిక పట్ల పలువు రు అభినందించారు.