J.SURENDER KUMAR,
ధర్మపురి కీ చెందిన వొడ్నాల భూమేశ్వర్ బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదం నెలకొంది.
స్నేహశీలి, విద్యాసంస్థల నిర్వాహకుడు, నీ గర్వి భూమేష్ మరణంతో ఆయన మిత్ర బృందం, విద్యార్థులు రోదించారు భూమేష్ అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో మిత్ర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
👉 ప్రమాదం తీరు..
స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కథనం మేరకు
భూమేశ్వర్ భార్య ను కరీంనగర్ లో TTC Training చేస్తుంది. ప్రతి రోజు ధర్మపురి నుంచి బస్సు లో కరీంనగర్ వెళ్తుంది,
బుధవారం భూమేశ్వర్ తన మోటార్ సైకిల్ పై తన భార్యతో ధర్మపురి బస్టాండ్ కు వెళ్ళాడు. తమ ముందటి నుండే బస్సు వెళ్ళింది. బస్సు ఆపి తన భార్యను ఎక్కిద్దామని మోటార్ సైకిల్ వెళుచుండగా ధర్మపురి శివారులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వారికి జగిత్యాల నుంచి ఎదురుగా ధర్మపురి వస్తున్న టాటా ఏసీ వాహనం అకస్మాత్తుగా కుడివైపు పెట్రోల్ బంక్ వైపు తిప్పి మోటార్ సైకిల్ నీ ఢీ కొట్టినట్టు ఎస్సై తెలిపారు.

భార్యా భర్తలిద్దరూ మోటార్ సైకిల్ నుండి కింద పడగా భూమేశ్వర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. భార్యకు కుడి కాలుకు గాయమైంది. 108 అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
భూమేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వివరించారు మెరుగైన చికిత్స గురించి కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్లు స్పష్టం చేశారు.. టాటా ఏసీ వాహనం నడిపిన డ్రైవర్ సల్లూరి రాజేష్ గుర్తించినట్టు ఎస్సై పేర్కొన్నారు.