రైతాంగానికి శాశ్వత పట్టం – భూ భారతి చట్టం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో..

J.SURENDER KUMAR,

భూమిని నమ్ముకున్న రైతులకు, భూ యజమానులకు, భూమితో ఉన్న బంధం, అనుబంధంను శాశ్వత పట్టం కట్టే లక్ష్యంతోనే  వారికి భూమి పై ఉన్న సర్వహక్కులు దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తున్నదని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

తెలంగాణ ప్రభుత్వము  అమలు చేస్తున్న భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలులో బాగంగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన బుగ్గారం మండలంలోని యశ్వంత్రావు పేటలో సోమవారం ఏర్పాటు చేసిన  రెవెన్యూ సదస్సులో  ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ , జగిత్యాల జిల్లా కలెక్టర్  సత్యప్రసాద్ , ఆర్డీవో తో కలిసి పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


భూ భారతి చట్టాన్ని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ప్రారంభించారు అని అన్నారు.
భూమిని నమ్ముకున్న భూ యజమానికి అట్టి భూమిపైన సర్వహక్కులు ఉండేదే ,భూభారతి అన్నారు.


గత ప్రభుత్వంలో ‘ ధరణి ‘ అంటూ ఓ పోర్టల్ తీసుకువచ్చి రైతులను అనేక ఇబ్బందులకు  గురి చేసిందన్నారు. ధరణినీ అడ్డం పెట్టుకొని రైతులకు భూమిపై హక్కులు ఉన్నప్పటికీ,  అ భూములను వేరే వ్యక్తుల పేర్ల మీద భూమిని మార్చడం, భూమిని ఎక్కువ ఉంటే రెవెన్యూ రికార్డుల లో తక్కువ నమోదు చేయడం వంటి  దుర్మార్గమైన పనులు చేశారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  అన్నారు. 

అలాంటి అవక తవకలు సరిచేసి రైతాంగానికి న్యాయం చేసే అధికారం తాసిల్దార్లకు,  ఆర్డీవోలు,  కలెక్టర్లకు లేకుండా చేసిన ఆ ధరణి చట్టాన్ని రద్దు చేసి రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా భూ భారతి చట్టాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తున్నది ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.