సమస్యలతో యంత్రాంగం నిరంతర సమరం చేశారు !

👉 ప్రశాంతంగా సరస్వతి పుష్కరాలు నిర్వహించారు !

👉 జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ !


J.SURENDER KUMAR,


కాళేశ్వరంలో 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన సరస్వతి పుష్కరాలలో ప్రభుత్వం యంత్రాంగం నిరంతరం సమస్యలతో సమరం చేశారు ప్రశాంతంగా పుష్కరాలు నిర్వహించారు,  విజయవంతం, చేశారు అంటూ జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించారు.


👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ మాట్లాడుతూ


పుష్కరాల నిర్వహణలో భాగంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయడం ద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేయగలిగామని తెలిపారు.


గత 12 రోజులుగా లక్షలాది మంది భక్తులు తృవేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు ఆచరించి, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. భద్రత, శుభ్రత, వైద్య సేవలు, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలలో అన్ని విభాగాల సిబ్బంది కృషిని కలెక్టర్  ప్రశంసించారు.


పుష్కరాల ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా  సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ హారతిని నిర్వహించిన కాశీ పూజారులను ప్రత్యేకంగా అభినందించారు.


ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పాలుపంచుకున్న ప్రతి శాఖ అధికారులకు, మీడియాకు, సేవలందించిన స్వచ్ఛంద సంస్థల సభ్యులకు మరియు శాంతి పూర్వకంగా పాల్గొన్న భక్తులకు కలెక్టర్ రాహుల్ శర్మ  హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.పుష్కరాలు ప్రశాంతంగా ముగియడం జిల్లా పౌరుల క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు.


👉 సీఎస్ రామ కృష్ణా రావు దంపతులు, పుష్కర స్నానం !


కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న సీఎస్ రామ కృష్ణా రావు దంపతులు, ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ దంపతులు, వడివట్టం, మేళ తాళాలతో ఆహ్వానం పలికిన ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు.

  అనంతరం సరస్వతి తల్లి చిత్రపటాన్ని అందించారు. పుష్కరాలు దిగ్విజయంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను అభినందించి శాలువాతో సత్కరించిన సీఎస్


👉 మీడియా మిత్రులకు కృతజ్ఞతలు !

భూపాల్ పల్లి జిల్లా డిపిఆర్ శ్రీనివాస్ !

మీడియా మిత్రుల సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు.  గత కొన్ని నెలలు ఈ 12 రోజులు మీ విస్తృత ప్రచారం ద్వారా సరస్వతి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా రావడం, కోట్ల మంది భక్తులు పరోక్షంగా కార్యక్రమాలు వీక్షించడానికి మీరు అందించిన సహాయ, సహకారాలకు మరియు విస్తృత  ప్రచారానికి ధన్యవాదాలు. అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంబంధాల శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.