👉 దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యర్ !
J.SURENDER KUMAR,
15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేయు భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు.
బుధవారం సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి మాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారని, పుష్కర స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారని, అనంతరం త్రివేణి సంగమంలో మొట్ట మొదటి సారిగా కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారని తెలిపారు.

మన రాష్ట్రంలో. మొట్ట మొదటిసారిగా పెద్ద ఎత్తున పుష్కరాలు నిర్వహిస్తున్నామని జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.