👉 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు !
J.SURENDER KUMAR,
శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాళేశ్వరంలో కుటుంబ సమేతంగా సరస్వతి తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సరస్వతి పుష్కర స్నానం చేశారు.

👉 ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..
పుష్కరాలు నిర్వహణ అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కాలేశ్వరంలో సరస్వతీ పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా, అనిర్వచనీయంగా ఉన్నాయన్నారు.
👉 పుష్కర స్నానంతో సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగి ఉంటే పుష్కర స్నానంతో అవి పరిసమాప్తం అవుతాయని అన్నారు.
👉 కుటుంబంతో కలిసి సరస్వతి పుష్కర స్నానం ఆచరించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.
👉 12 రోజుల పాటు జరగనున్న పుష్కరాలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశారని, వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారని రానున్న 10 రోజులు చాలా కీలకమని అన్నారు.
👉 మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఎక్కడా చిన్న లోపం రాకుండా భక్తులందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని అన్నారు.
👉 లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. భక్తులు సౌకర్యాలు కల్పన కు ఏర్పాటు చేసిన టెంట్ సిటీ అద్భుతంగా ఉందని అభినందించారు.
👉 భద్రత, పారిశుద్ధ్యం, స్నానాల ఘాట్ల వద్ద ఏర్పాట్లను అధికారులు నిబద్ధత, నిష్టతో ఏర్పాటు చేశారని వివరించారు
.
👉 పుష్కర స్నానాలకు ప్రతిరోజు ఒక పీఠాధిపతి వచ్చి స్నానం ఆచరించి ముక్తేశ్వర దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇదొక గొప్ప సందర్భమని అన్నారు.
👉 డిప్యూటీ సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం, భూపాలపల్లి మక్కన్ సింగ్, గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
👉 డిప్యూటీ సీఎం పర్యటనలు దృశ్యమాలిక !













