👉 ఆదివారం అప్రమత్తంగా ఉండాలి !
👉 కలెక్టర్ రాహుల్ శర్మ !
J.SURENDER KUMAR,
సరస్వతి పుష్కరాలు సందర్భంగా ఆదివారం ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం రాత్రి అప్రమత్తం చేశారు. శనివారం దాదాపు లక్షా మంది కి పైగా భక్తులు పుష్కర స్నానం చేసినట్టు అధికారులు వివరించారు.
పుష్కర ఘాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఆరోగ్య సేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్, అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 ఆర్టీసీ యంత్రాంగం తో ముందస్తు సమాచారం
కరీంనగర్, గోదావరిఖని, మంథని డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మూడు డిపోల పరిధిలో 50 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణ యించగా రద్దీ పెరగడంతో అంతకుమించి బస్సులు నడుపుతన్నట్లు . శనివారం మూడు డిపోల పరిధిలో సాయంత్రం 50 బస్సులు నడిపినట్టు పుష్కర నిర్వహణ యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. ఆదివారం కాలేశ్వరం కు ఆయా డిపోల నుండి వచ్చే బస్సుల సంఖ్యను ప్రతి మూడు గంటలకు సమాచార ఇవ్వాలని కోరారు.

👉 భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో శనివారం వాహనాలు రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని అలాంటి సమస్య రాకుండా పకడ్బందీగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
👉 వాహనాలు క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణకు పోలీసు, రవాణా, దేవాలయంలో భక్తులు క్యూ పాటించుట వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం జరిపి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు.

👉 శనివారం భక్తులు రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంగా ఆదివారం ట్రాఫిక్ సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
👉 తెల్లవారుజాము నుండే భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్ని శాఖల అధికారులు వారికి. కేటాయించిన విధుల్లో నిమగ్నం కావాలని స్పష్టం చేశారు.

అలాంటి ట్రాఫిక్ జామ్ జరగకుండా భక్తుల అసౌకర్యాలు కలగకుండా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికార యంత్రాంగాన్ని కి విజ్ఞప్తి చేశారు.