J.SURENDER KUMAR,
వెల్గటూర్ మండలం కోటిలింగాల పుణ్యక్షేత్రంలో శుక్రవారం జరిగిన శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఎమ్మెల్యే ను స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం బహుకరించి వేదమంత్రాలతో ఆశీర్వదించి సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శతాబ్దాల చరిత్ర గల కోటిలింగాల క్షేత్రాన్ని గొప్ప పర్యటన , ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, భక్తజనంకు అలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
👉 విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే !

గత రెండు రోజుల క్రితం వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అభినందించారు.

ధర్మపురి ఆంగ్లోవేదిక్ పాఠశాల విద్యార్థులు సాధించిన అత్యున్నత మార్కులు ఇతర పాఠశాల విద్యార్థులకు ఆదర్శం కావాలని, పాఠశాల బోధన సిబ్బందిని యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించి విద్యార్థులను సన్మానించారు.