👉 త్రివేణి సంగమం ఒడ్డున..
J.SURENDER KUMAR,
సరస్వతి నది పుష్కరాల ప్రారంభ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రివేణి సంగమం ఒడ్డున ఏర్పాటు చేసిన (17) అడుగుల సరస్వతీ మాత విగ్రహం, రెండు వైపుల చతుర్వేద మూర్తుల విగ్రహాలను ఈరోజు సాయంత్రం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు, పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.