శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకువస్తాం !  

👉 డయ‌ల్ యువ‌ర్ ఈవో లో ఈవో  జె శ్యామలరావు !


J.SURENDER KUMAR,


శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు  చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో  జె.శ్యామలరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాలు, చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌లువురు భ‌క్తులు అభినందించారు.  ఈ సందర్భంగా టీటీడీ ఈవో 35 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.


👉 స‌త్య నారాయ‌ణ-హైద‌రాబాద్‌.


ప్ర‌శ్న :  ల‌డ్డూ సేవ‌ను 65 సంవ‌త్స‌రాలు దాటిన వారికి ఇవ్వండి. ప‌ర‌కామ‌ణి సేవలో పాల్గొన్న‌వారికి ప్ర‌తిరోజూ ద‌ర్శ‌నం క‌ల్పిస్తే బాగుంటుంది ?


ఈవో  : ప‌ర‌కామ‌ణి సేవ చేసిన‌వారికి ప్ర‌తిరోజూ ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం సాధ్యంకాదు. ల‌డ్డూసేవ‌ను గ‌తంలో ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి స‌రైన ఫ‌లితాలు రానందున ఆపేయ‌డం జ‌రిగింది.


👉 నాగ‌శ్రీను-రాజ‌మండ్రి.


ప్ర‌శ్న : జూలై నెల‌లో ద‌ర్శ‌నాల‌కు అద‌న‌పు కోటా విడుద‌ల చేసే అవ‌కాశం ఉందా ?


ఈవో  :  ఆన్ లైన్ లో అద‌న‌పు కోటా విడుద‌ల చేసే అవ‌కాశంలేదు. క‌రెంటు బుకింగ్ లో మాత్ర‌మే ద‌ర్శ‌న టోకెన్లు అందుబాటులో ఉంటాయి.


👉 ఉషారాణి– హైద‌ర‌బాద్‌.


ప్ర‌శ్న‌ : సీనియ‌ర్ సిటిజ‌న్ ద‌ర్శ‌నాల్లో స‌హాయ‌కులుగా మ‌రొక‌రిని పంపించేందుకు వీలవుతుందా ?


ఈవో :  అలాంటి అవ‌కాశం ఉండ‌దు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌హాయం అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కులు అందుబాటులో ఉంటారు.


👉 ప్ర‌సాద‌రాజు– దేవ‌ర‌ప‌ల్లి.


ప్ర‌శ్న‌ :  గ‌తంలో తిరుమ‌ల‌లో సీఆర్వోలోనే కాకుండా ఇత‌ర ప్రాంతాల్లో గ‌దుల కేటాయింపు కేంద్రాలు ఉండేవి. ప్ర‌స్తుతం సీఆర్వోలో మాత్ర‌మే గ‌దులు ఇస్తుండ‌టంతో భ‌క్తులు ఇబ్బంది ప‌డుతున్నారు ?


ఈవో :  ఇత‌ర ప్రాంతాల్లో గ‌దుల కేటాయింపు వ‌ల్ల ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని సీఆర్వోకే ప‌రిమితం చేశాం. దీనిపై భ‌క్తుల నుండి మంచి స్పంద‌న వ‌స్తోంది.


👉 .డాక్ట‌ర్ మ‌నోజ్‌- చ‌త్తీస్‌ఘ‌డ్‌


ప్ర‌శ్న‌ : శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి పారామిలిట‌రీ ద‌ళాల‌కు ప్ర‌త్యేక అవ‌కాశం క‌ల్పించండి?


ఈవో  : ఇప్ప‌టికే ఆర్మ‌డ్ ఫోర్స్ కు ఈ అవ‌కాశం ఉంది. కోటా పెంచ‌డం సాధ్యం కాదు. ఆర్మ‌డ్ ఫోర్స్ కోటాలోనే ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తాం.


👉 తిరుప‌త‌య్య‌– హైద‌రాబాద్‌


ప్ర‌శ్న: అఖిలాండ వ‌ద్ద చిరు వ్యాపారుల వ‌ద్ద భ‌ద్ర‌తా సిబ్బంది డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు?


ఈవో : వివ‌రాలు తెలియ‌జేస్తే ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటాం.


👉 రేవంత్-అనంత‌పురం.


ప్ర‌శ్న :  స‌ర్వ ద‌ర్శ‌నానికి వ‌చ్చి దివ్యాంగులు ఇబ్బంది ప‌డుతున్నారు. వారికి ఏమైన ప్ర‌త్యేక ద‌ర్శ‌న స‌దుపాయం ఉందా ?


ఈవో : ఇప్ప‌టికే రోజుకు 750 టోకెన్లు వృద్ధులు, దివ్యాంగుల‌కు జారీ చేస్తున్నాం. భ‌క్తుల ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌త్యేక ద‌ర్శ‌న స‌దుపాయం క‌ల్పించ‌లేం.


👉 గిరిధ‌ర్-విజ‌య‌వాడ‌.


ప్ర‌శ్న‌: సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌మో భారం దృష్ట్యా ఆల‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌స‌తి గ‌దులు కేటాయింపు, అన్న‌ప్ర‌సాద కేంద్రంలో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది ?


ఈవో : గ‌దుల కేటాయింపు విష‌యంలో మీ సూచ‌న‌ను ప‌రిశీలిస్తాం. అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలోని హాల్‌-1లో ఇప్ప‌టికే సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది.


👉 గోపాల్ రెడ్డి-హైద‌ర‌బాద్‌.


ప్ర‌శ్న : బ్రహ్మోత్సవాల్లో దాత‌ల ద‌ర్శ‌న కోటా ర‌ద్దు చేస్తున్నారు?


ఈవో  : భ‌క్తుల అధిక ర‌ద్దీ కార‌ణంగా దాత‌ల ద‌ర్శ‌న కోటాను ర‌ద్దు చేస్తున్నాం. 


👉 అరుణ్‌ -హైద‌ర‌బాద్‌.


ప్ర‌శ్న : తాము అర్చ‌న‌ టికెట్ బుక్ చేసుకునే స‌మ‌యానికి మా అబ్బాయికి 12 ఏళ్లు ఉండేవి. ద‌ర్శ‌నాకి వ‌చ్చేట‌ప్ప‌టికి 13 ఏళ్లు నిండటంతో అనుమ‌తివ్వ‌డం లేదు. ఇలాంటి వారికి ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉంటుందా ?


ఈవో : నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డం సాధ్యం కాదు.


👉  సుధాక‌ర్-క‌డ‌ప‌.


ప్ర‌శ్న : దివ్యాంగుల‌ను వీల్ చైర్ లో ఆల‌యం లోప‌ల‌కి అనుమ‌తించండి?


ఈవో  : ఆల‌యంలో స్థ‌లాభావం వ‌ల్ల సాధ్యం కాదు.


👉 బిందు-హైద‌రాబాద్‌.


ప్ర‌శ్న : శ్రీ‌వారి పుష్క‌రిణీలో ప‌రిశుభ్ర‌త పాటించ‌డంలేదు. స‌బ్బులు, షాంపుల‌తో స్నానం చేస్తున్నారు ?


ఈవో  : విచారించి చ‌ర్య‌లు చేప‌డ‌తాం.


👉 నారాయ‌ణ‌-ఒంగోలు. గోపి-ఖ‌మ్మం.


ప్ర‌శ్న : దేశ ర‌క్ష‌ణ‌కు ఒక సంవ‌త్స‌ర హుండీ ఆదాయాన్ని విరాళంగా ఇవ్వండి. క్యూలైన్ల‌లో 5-10 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయండి?


ఈవో  : పిల్ల‌ల‌కు ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌న ఏర్పాట్లు చేస్తున్నాం.   


👉 ర‌వి కుమార్‌-కావ‌లి.


ప్ర‌శ్న : టీటీడీ నేత్ర దాన ట్ర‌స్టు ఏర్పాటు చేస్తే ఎంతో మంది భ‌క్తుల‌కు మేలు జ‌రుగుతుంది?


ఈవో  : ఈ అంశంపై ఇప్ప‌టికే అర‌వింద్ కంటి ఆసుప‌త్రితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం. త్వ‌ర‌లో విధివిధానాలు ప్ర‌క‌టిస్తాం.


👉 మ‌హేశ్వ‌ర‌రావు-న‌ర్సారావు పేట‌.  


ప్ర‌శ్న : ఎస్ఎస్‌డీ టోకెన్లు రాత్రి స‌మయంలో జారీ చేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్నాం ?


ఈవో  : భ‌క్తుల సూచ‌న మేర‌కు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. దీనిపై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.


👉 నర్సా నాయుడు-అనంత‌పురం.


ప్ర‌శ్న : శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద న‌డ‌క‌దారిని వ‌చ్చే భ‌క్తులంద‌రికీ టోకెన్లు ఇవ్వండి ?


ఈవో  : ఇప్ప‌టికే రోజుకు 3 నుండి 4వేల వ‌ర‌కు టోకెన్లు జారీ చేస్తున్నాం. ఆ సంఖ్య‌ను పెంచితే స‌ర్వ ద‌ర్శ‌న భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లుగుతుంది.


👉. నామాల‌స్వామి-కాకినాడు. శ్యామ‌ల కుమార్‌-కామారెడ్డి.


ప్ర‌శ్న  : శ్రీ‌వారి సేవ‌కు ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో కూడా అవ‌కాశం ఇవ్వండి ?


ఈవో   : ఆఫ్ లైన్ లో ఇవ్వ‌డం వ‌ల్ల చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని ఫిర్యాదులు రావ‌డంతో ఆన్ లైన్ లో ఇస్తున్నాం. శ్రీ‌వారి సేవ‌లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్నాం.

👉. ల‌క్ష్మీ నారాయ‌ణ‌-హైద‌ర‌బాద్‌.


ప్ర‌శ్న :  శ్రీ‌నివాస మంగాపురంలో వేద ఆశీర్వ‌చ‌నాన్ని ఏక బ్రాహ్మ‌ణుడే ఇస్తున్నాడు ?


ఈవో  :  ఈ అంశాన్ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటాం.