J.SURENDER KUMAR,
వేసవి సెలవులలో విద్యార్థులకు అమూల్యమైన సేవలందిస్తున్న స్వశోధన్ ట్రస్ట్ సేవలు అభినందనీయం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి బాలికల ఉన్నత పాఠశాల లో సోమవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి తో కలసి సమ్మర్ క్యాంప్ తరగతి గదులను ప్రారంభించారు.
స్వశోధన్ ట్రస్ట్ , వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి జూన్ 6 వరకు నిర్వహించనున్న యోగా, ఫిట్నెస్, మెడిటేషన్, లైఫ్ స్కిల్స్ తదితర అంశాలపై ఫ్రీ సమ్మర్ క్యాంప్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
👉 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతుల శిబిరం ధర్మపురి ఎంఈఓ సీతాలక్ష్మి !

ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ యంగ్ ఇండియా వారిచే స్థానిక ధర్మపురి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండలం లోని 6 నుండి 9 వ తరగతి చదివే విద్యార్థులకు శిక్షణ తరగతుల కొనసాగుతాయని ధర్మపురి ఎంఈఓ శీతాలక్ష్మి తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఆయన సతీమణి కాంత కుమారి, సోమవారం శిక్షణ తరగతులను ప్రారంభించారు.
మే 5 తేదీ నుండి పదిహేను రోజుల పాటు ఉదయం 9 నుండి 11 వరకు వేసవి శిక్షణా తరగతులు కొనసాగుతాయని తెలిపారు.

శిక్షణలో విద్యార్థులకు గణితం , స్పోకెన్ ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రం,నైతిక , సామాజిక విలువలు, చిత్రలేఖనం మరియు మొదలగు అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని కల్పించడానికి నిష్ణాతులైన, నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల చే శిక్షణ ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు.
👉 ఆసక్తిగల విద్యార్థుల పోషకులు
శిక్షణ శిబిరం కో ఆర్డినేటర్ రావులపెల్లి శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్ గణితం ZPHS(G).. (సెల్ నం.9121395356) ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకొని తరగతులకు పంపాల్సిందిగా ఎంఈఓ ఎస్. సీతాలక్ష్మి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.