తెలంగాణ పోలీసు ప్రపంచంలోనే నంబర్ వన్  సాధించడం అభినందనీయం !


👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అభినందించారు.

ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్’ కేటగిరీలో మొదటి బహుమతిని అందుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్  ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.

దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో హైదరాబాద్ సీపీ ఈ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ను ముఖ్యమంత్రి  అభినందించారు.