టెండర్లు ఖరారు కాకముందే ఆరోపణలా ? విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ఇంటిగ్రేటెడ్, గురుకుల విద్యాసంస్థలకు టెండర్లు ఖరారు కాకముందే బిఆర్ఎస్ నాయకులు అవినీతి ఆరోపణలతో  తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాదులోని సి ఎల్ పి  కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మీడియా సమావేశంలో మాట్లాడారు.


మా ప్రభుత్వం  ₹ 16 వేల కోట్ల నిధులతో అధునాతనమైన మౌలిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ప్రభుత్వ స్కూళ్లు ఉన్నప్పుడు కొత్తగా స్కూళ్లు ఎందుకు?’’  అని అన్నవారు  తమ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో  కొత్తగా గురుకులాలు ఎందుకు ప్రారంభించారనీ, గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కట్టినప్పుడు బి ఆర్ ఎస్ నాయకులు ఏమన్నారో చెప్పాలనీ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు.


బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో గురుకులాలలో భద్రత, భవనాలు, టాయిలెట్లు, మెస్ సౌకర్యాలు లేక విద్యార్థులు  ఇబ్బందులు పడ్డారన్నారు.  కొన్నిచోట్ల నాలుగు, అయిదు టాయిలెట్ల తో   వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని ఆడపిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కనిపించలేదని  విప్ లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.


ప్రజా పాలన ప్రభుత్వం లో  మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి, గురుకులాల పరిస్థితి నీ మెరుగుపరుస్తూ  మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనాలు చేస్తూ నిద్రిస్తున్నారని అన్నారు.


బీఆర్ఎస్ రాచరిక విమర్శలు కాకుండా, ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలనీ,
పేద పిల్లల భవిష్యత్తుపై ద్వేషం ఎందుకు అంటూ గతంలో చేసిన తప్పుల వల్ల ప్రజలు మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించారు అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వారికి గుర్తు చేశారు.