👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J. SURENDER KUMAR,
మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన మీ ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, అంటూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ రైతులను పరామర్శిస్తూ అన్నారు.

బుధవారం రాత్రి రాత్రి కురిసిన అకాల వర్షానికి ధర్మపురి మండలం జైన, బుగ్గారం మండల కేంద్రంలో, గురువారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసున్నారు.
అనంతరం ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ…

జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో తడిసిన ధాన్యం కొనుగోలు అంశం పై చర్చించామన్నారు. రైతులు ఎక్కడ ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందన్నారు. ధాన్యం రవాణా కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టు తెలిపారు.
ఏమైనా ఇబ్బందులు ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చనీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.