తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం అధైర్య పడవద్దు!

👉 కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలి !

👉 ప్రతి రోజు కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే ధాన్యం తరలింపు చేయాలి

👉 జగిత్యాల జిల్లా  కలెక్టర్ సత్య ప్రసాద్ !


J.SURENDER KUMAR,


జిల్లాలో తడిసిన ధాన్యం కుప్పలను ఆరబోసి మ్యాచర్ వచ్చిన వెంటనే వేగవంతంగా  కొనుగోలు చేయాలని జగిత్యాల  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు .

👉 శుక్రవారం  బుగ్గారం మండలం మద్దనూరు    మరియు ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ  చేశారు.

👉 జగిత్యాల  జిల్లాలోని తడిసిన ధాన్యం ఆరబోసి మ్యాచర్ వచ్చిన  వెంటనే ధాన్యాన్నికొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కొనుగోలు చేసిన సంచులను  నానినట్లయితే వెంటనే బైల్డ్ రైస్ మిల్లర్లకు వెంటనే పంపించాలని అధికారులకు ఆదేశించారు

👉 ప్రతిరోజు  మిల్లులకు పంపాలి, రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడా లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు 

👉 రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు.

👉 కొనుగోలు సెంటర్లలోధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హామా లీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

👉 వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు . మరియు రైతులు  అప్రమత్తంగా ఉండాలని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ అన్నారు

👉 సెంటర్ ఇంచార్జ్ అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని  జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు  .
జిల్లా కలెక్టర్ వెంట   డి సి ఓ మనోజ్ కుమార్ డి ఎస్ ఓ జితేందర్ రెడ్డి, డి ఎం జితేంద్ర ప్రసాద్ బుగ్గారం తహసిల్దార్ ధర్మపురి  ఇన్చార్జ్ తహసిల్దార్ సుమన్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.