తిరుమల శ్రీ‌వారికి 5 కిలోల బంగారు ఆభరణాల విరాళం !

J. SURENDER KUMAR,

తిరుమ‌ల శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారికి శుక్ర‌వారం ఉద‌యం భారీ బంగారు కానుక విరాళంగా అందింది.


కలక‌త్తాకు చెందిన  సంజీవ్ గోయెంకా ₹.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వ‌జ్రాలు, ర‌త్నాల‌తో పొదిగిన‌ క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాల‌ను చేయించి స్వామివారికి స‌మ‌ర్పించారు.


ఈ మేర‌కు తిరుమ‌ల‌లోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టీటీడీ అద‌న‌పు ఈవో  సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రికి ఆభ‌ర‌ణాల‌ను అందజేశారు.


ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో లోక‌నాథం, బొక్క‌సం ఇన్ ఛార్జి  గురురాజ స్వామి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.