👉 తోటి ఉపాధ్యాయుడు, ఎంఈవోపై దాడి సంఘటనలో..
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు ప్రాద మిక పాఠశాల ఉపాధ్యాయుడు మహేష్ ను ప్రభుత్వం శుక్రవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
👉 వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం రెండు పాఠశాలలకు చెందిన ఉపాధ్యా యులు, తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పాఠశాల ఆ వరణలో మహేశ్, తోటి ఉపాధ్యాయుడు రమేష్ ను మండల విద్యాధికారిణి సీతాలక్ష్మిని , దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు.
ఎంఈఓ సీతాలక్ష్మి చేతికి తీవ్ర గాయమైంది. మహేశ్ ప్రవర్తనపై గతంలో ఉపాధ్యాయుడు రమేశ్ జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయడాన్ని కక్ష పెంచుకొని దాడికి పాల్పడి చంపుతానని బెదిరించాడు. గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన ఎంఈవో పై కూడా దాడి చేసి గాయపరి చాడు
👉పోలీస్ కేసు నమోదు సస్పెండ్

ఉపాధ్యాయుడు మహేష్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి రాము శుక్రవారం ఆదేశాలు జారీ చేశాడు. ఆస్పత్రిలో ఎంఈవో సీతాలక్ష్మి చికిత్స పొందుతున్నారు. ధర్మపురి ధర్మపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ సంఘటనపై రాష్ట్ర విద్యాశాఖ ఇంటిలిజెన్సీ అధికారులతో సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. దాడి సంఘటన పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి
