ఉత్తర తెలంగాణ జిల్లాలలో భూకంపం !

👉 12 సెకన్ల పాటు కంపించిన భూమి !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లాతో పాటు,  ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భూకంపం సంబవించింది.
సాయంత్రం 6.49 నిమిషాల్లో భూమి 12 సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు ఆందోళన గురై ఇండ్ల నుండి బయటికి వచ్చారు.


ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్టు ఆయా ప్రాంతాల బంధుమిత్రులు ఫోన్లో ద్వారా పరస్పర యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తాన్బాద్, లక్సెట్టిపేట్, పెద్దపల్లి, నిర్మల్, కడెం, ఖానాపూర్, జన్నారం ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.


పెద్ద శబ్దం తో భూమీ కoపించగా కింద కూర్చున్న వ్యక్తుల కు వైబ్రేషన్స్ రాగ  భయాందోళనలకు గురయ్యారు. భూకంపంతో పాటు ఏదో  శబ్దం కూడా వినపడినట్టు  స్థానికులు తెలిపారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.