👉 వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ !
J.SURENDER KUMAR,
వర్గీకరణ అంశం రెండు కులాల పంచాయతీ గా చాలామందిలో ఓ అభిప్రాయం ఉందని, అయితే వర్గీకరణ రెండు కులాల పంచాయతీ కాదని, సామాజిక, ఆర్థిక, విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెనుకబడిన కులాల ఆర్థిక సామాజిక సమతుల్యం కోసమే వర్గీకరణ చేపట్టడం జరిగిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ ఏసీ గార్డెన్ లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం తుది తీర్పుతో ముగింపు పలికిందన్నారు
👉 వెనుకబడి 59 కులాలు విద్య, ఉద్యోగ, జీవన విధానం, ఆర్థిక స్థితిగతుల అధ్యయనం, వారి ఆర్థిక అసమానతల గుర్తింపు వర్గీకరణ ప్రధాన లక్ష్యం అన్నారు.
👉 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే ఏ అంశంలోనూ నిబంధనలు విస్మరించకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అత్యున్నత కమిషన్ నియమించి కమిషన్ ద్వారా ప్రభుత్వం నివేదిక తెప్పించుకుందన్నారు.
👉 కమిషన్ నివేదిక ఆధారంగా ముందుగా బిల్లు రూపంలో, ఆ తరువాత వర్గీకరణ చట్టాన్ని నోటిఫికేషన్ జీవో జారీ చేశానన్నారు.
👉 దేశంలో వర్గీకరణ చట్టం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
👉 ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెనుకబడి 59 కులాలకు ఏ విధంగా, ఏ రూపంలో అందించాలో అనే అవగాహనతో ప్రభుత్వం వారికి అవకాశాలు కల్పిస్తుంది అన్నారు.
👉 ప్రస్తుతం ‘ దోస్త్ ‘ లో ఆయా కులాలకు కొంత శాతం కోటా కేటాయించామన్నారు.
👉 త్వరలో ప్రకటించనున్న ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఈ మేరకు ఆయా కులాలకు రిజర్వేషన్లు కల్పించనున్నామని అన్నారు.
👉 రెండు లక్షల రుణమాఫీ, రేషన్ షాప్ లో సన్న బియ్యం, సబ్సిడీ విద్యుత్తు, సిలిండర్, సన్న వడ్లకు ₹ 500 /- బోనస్, రైతు భరోసా, 56 వేల ఉద్యోగాల నియామకం, మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, భూ భారతి అమలు చేస్తున్నామన్నారు.
👉 1931 సంవత్సరంలో కులగణ సర్వే జరిగిందని, ఆ తరువాత తెలంగాణలో తెలంగాణ సర్వే జరిగిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన జరగాలి, దాని ఆధారంగా సంక్షేమ ఫలాలు అందరికీ చెందాలి అని పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని అన్నారు.