ఓటమి మన గెలుపుకు మార్గం చూపుతుంది  ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఆట పోటీలు, రాజకీయ రంగం, జీవితంలో గెలుపు ఓటములు సహజం, ఓటమి మాత్రం మన గెలుపు కోసం, పట్టుదలతో పాటు, మార్గం చూపుతుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రామారావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడాకారులు ఓటమితో నిరాశ పడవద్దు అని, గెలవాలనే పట్టుదల, ధైర్యం ఓటమి మనలో ప్రేరేపిస్తుందని క్రీడాకారులకు ఎమ్మెల్యే వివరించారు.

క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
గెలుపొందిన  క్రికెట్ జట్టు సభ్యులను అభినందించి ₹ 20 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ ని అందించారు.

👉 ₹ 4 లక్షల CMRF చెక్కు పంపిణీ !

బుగ్గారం మండలం బిర్సాని గ్రామానికి చెందిన చుంచు రజిత కు  ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయినా ₹ 4 లక్షల  చెక్కును ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ధర్మపురి లో క్యాంపు కార్యాలయంలో రజిత కు అందించారు.

👉 సబ్సిడీ రొట్టె విత్తనాల పంపిణీ !

ధర్మపురి పట్టణ కేంద్రంలోని KDCMS ఎరువుల దుకాణంలో  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సబ్సిడీ రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  పాల్గొని  రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.