వైభవంగా ధర్మపురి నరసింహుడి సహాస్ర కలశాభిషేకము !

👉 శ్రీ లక్ష్మీనరసింహ నవరాత్రి ఉత్సవాలలో.. సహస్ర కలశాభిషేకం !

J.SURENDER KUMAR,

ధర్మపురి  శ్రీ లక్ష్మీనర్సింహస్వామి   నవరాత్రోత్సవములలో భాగంగా బుధవారం అంగరంగ వైభవంగా  స్వామివారికి సహాస్ర కలశాభిషేకము నిర్వహించారు.

ఈ అభిషేక పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.


ఆలయంలో ఉదయం పూర్ణాహుతి కార్యక్రమము  పిదప శ్రీస్వామి వారికి పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త,న్యానక పూర్వక షోడశ ఉపచార పూజ, సహాన్రనామార్చన, వంచోవనిషత్తులతో మరియు మన్య సూక్తముత్మో, మరియు రుద్రాభిషేక పూజలు, పంచోపనిషత్తులతో  “సహాస్ర కలశాభిషేకము” అర్చకులు, వేద పండితులు వైభవముగా నిర్వహించారు.


ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సిహెచ్ రమణయ్య, అర్చకులు నంబి నర్సింహమూర్తి, నేరేళ్ళ సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, సముద్రాల వంశీ, చక్రపాణి కిరణ్, అభిషేక పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ,
కార్యనిర్వహణాధికారి  సంకటాల శ్రీనివాస్, అధ్యక్షులు  జె. రవీందర్, ధర్మకర్తలు,
సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.