J.SURENDER KUMAR,
ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ప్రయోజనాల కు సంబంధించి 57 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జిల్లా ఎంప్లాయిస్ JAC చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి కన్వీనర్ కందుకూరి రవి బాబు కలసి అందజేశారు.
.TGEJAC కేంద్ర సంఘం సూచనల మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా పక్షాన, ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జిల్లా జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా జేఏసీ నాయకులతో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించేందుకు తనవంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే ను కలసిన జేఏసీ నాయకులలో ధర్మపురి తహసీల్దార్ కృష్ణ చైతన్య,
కో చైర్మన్లు ఎండీ. వకీల్, మచ్చ శంకర్, చంద్రయ్య, , రామ్ రెడ్డి, గంగరాజం, హరి అశోక్ కుమార్, తుంగూరి సురేష్, గంగ నర్సయ్య, అత్తినేని శ్రీనివాస్, డిప్యూటీ కన్వీనర్ లు అమరేందర్ రెడ్డి, మామిడి రమేష్, కో కన్వీనర్ లు అమర్నాథ్ రెడ్డి, వేణు, నరేందర్, సతీష్, నాయకులు సాహెద్ బాబు, మహమూద్, అశోక్ రాజు, రాజేందర్ రెడ్డి, మమత, రవీందర్, , రాజేశం, మధుకర్, రఘుపతి యాదవ్, మ్యాన పవన్ , బన్న, విశ్వనాధం, భూమ్ రెడ్డి, సతీష్ కుమార్, శ్రీకాంత్, శివ ప్రసాద్, రాజన్న, రాజేష్, గంగాధర్, దేవయ్య, నాగరాజు, జనార్దన్, డా. వేణుగోపాల్, గణేష్, సంజయ్, ప్రశాంత్, తదితరులు ఉన్నారు.