👉 పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి !
J.SURENDER KUMAR,
మంగళవారం ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ శాఖ వంటి పలు అంశాల పై సీఎం రేవంత్ రెడ్డితో, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

👉 పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ
మే 26,2025 నాటికి యాసంగి సీజన్ లో ప్రభుత్వం 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని,
గత సంవత్సరం యాసంగి లో కొనుగోలు చేసిన ధాన్యం కంటే 22 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా కొనుగోలు చేయడం పట్ల మంత్రి అధికారులకు అభినందనలు తెలిపారు.
యాసంగి ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకుందని, అకాల వర్షాల కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందని, వీటిని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు.
ధాన్యం రవాణా నిమిత్తం సమస్యలు రాకుండా రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి అవసరమైన వాహనాలు అందుబాటులో పెట్టాలని, రైస్ మిల్లర్లు సహకరించని పక్షంలో ఇంటర్మీడియట్ గోదాములకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఎక్కడా హామాలీల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
రైతులకు ధాన్యం చెల్లింపులు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసిన 48 గంటల లోగా పూర్తి చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశం పై ఎటువంటి వ్యతిరేక వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తను విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, తప్పుడు వార్తలు ప్రచారంలో ఉంటే వెంటనే ఖండించాలని మంత్రి ఆదేశించారు.
👉 రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,
పైలెట్ ప్రాజెక్టు కింద మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లలో 15 శాతం మాత్రమే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన ఇండ్ల పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇందిరమ్మ ఇండ్లలో పైలెట్ గ్రామాల్లో మంజూరు చేసిన ఇండ్లు మినహాయించి మిగిలిన ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఇప్పటి వరకు లక్షా 30 వేల మంది లబ్ధిదారులను అర్హులుగా ఎంపిక చేసినట్లు రిపోర్ట్ ఉందని మంత్రి తెలిపారు.
భూ భారతి చట్టం కింద పైలెట్ మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించి జూన్ 2 నాడు పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు. అసైన్మెంట్ భూముల సంబంధించి విక్రయం జరిగిన భూముల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాల ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లకు జిల్లాల్లో శిక్షణ అందించే కార్యక్రమం ప్రారంభించామని, ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
👉 వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ,
మే నెలలోనే వర్షాలు రావడం చాలా సంతోషకరమైన అంశమని అన్నారు. వానాకాలం పంట సాగు వ్యవసాయ శాఖ సన్నద్దం కావాలని, విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి విత్తనాల విక్రయం పర్యవేక్షించాలని, ఎక్కడా నకిలీ విత్తనాలు అమ్మకం జర్గవద్దని అన్నారు.
👉 ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ,
రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో పెండింగ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు.
వానాకాలం పంట సాగు కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టాలని, అకాల వర్షాల నుంచి రైతులను కాపాడేందుకు ముందస్తు సాగు ప్రోత్సహించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, జెడ్పిసిఓ గౌతమ్ రెడ్డి, ఆర్డీవోలు జగిత్యాల్ కోరుట్ల మెట్పల్లి డిఆర్డిఓ రఘువరన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, డిపిఓ డిఎస్ఓ డి ఎం ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.