వైద్యుల సమస్యల పరిష్కారానికి కమిటీ నియమిస్తాం !

👉 ఐటి, పరిశ్రమల మంత్రి  శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల, వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పక్షాన ప్రత్యేక కమిటీని నియమించి నివేదిక మేరకు  కార్యాచరణ ప్రణాళిక అమలకు చర్యలు చేపడతామని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

కరీంనగర్ పట్టణంలోని హాటల్ ప్రతిమ మల్టీప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్ లో రెండు రోజులపాటు జరుగుతున్న   THANCON – 2025 ( తెలంగాణ రాష్ట్ర హాస్పిటల్స్& నర్సింగ్ హోం అసోసియేషన్ )  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11 వ  వార్షిక ముగింపు సమావేశం ఆదివారం జరిగింది.

ఈ కార్యక్రమానికి  రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు కవ్వంపెళ్లి సత్యనారాయణ,  డాక్టర్ ఎం సంజయ్ కుమార్, డాక్టర్ కే సంజయ్ , డాక్టర్ హరీష్ బాబు, పాల్గొన్నారు.


ఈ సందర్భంగా  THANCON  బాధ్యులు తమపై దాడులు, ఆస్పత్రి నిర్వహణలో మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం తో ఇబ్బందులు, తదితర సమస్యల పరిష్కారానికి విన్నవించారు. వైద్యులపై దాడి చేస్తే నాన్ వెలబుల్ సెక్షన్ తో పాటు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల శిక్ష పడేలా చట్టం తేవాలని, రాష్ట్రంలో దాదాపు 5, 6 లక్షల మంది అర్హత లేని నకిలీ వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నారని వారిని గుర్తించి చర్యల కోసం విన్నవించారు. 50 పడకల లోపు ఆసుపత్రులకు,  సంబంధిత అధికారులతో వేధింపులు లేకుండా చూడాలని మంత్రి శ్రీధర్ బాబుకు సమావేశంలో విజ్ఞప్తి చేశారు.


ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.