యువతులు విద్య తో పాటు స్వయం శక్తితో ఎదగాలి !

👉 ధర్మపురి ఎమ్మెల్యే  లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

యువతులు, మహిళలు విద్య తోపాటు స్వయం శక్తితో ఉపాధి అవకాశాలు పొందుతూ ఎదగాలని  వారి స్వయం ఉపాధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.


జగిత్యాల జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయంతో వెల్గటూర్ మండలం చెగ్యం, కిషన్ రావు పెట్ గ్రామల లో ఆదివారం ఏర్పాటు చేసిన ఎస్సీ యువతులకు కుట్టు మిషన్లు, మరియు శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ..

జిల్లాఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయంతో  వెల్గటూర్ మండలం  చెగ్యాంలో ఏర్పాటు చేసిన ఎస్సీ యువతులకు 50 మంది కిషన్ రావు పేటలో 53 మంది యువతులకు  శిక్షణ ఇవ్వడం వారికి కుట్టు మిషన్ లు,  సర్టిఫికెట్ల పంపిణీ లో పాల్గొనడం చాలా సంతోషంగా  ఉందన్నారు.

గతంలో శిక్షణ పొంది మరియు నూతనంగా శిక్షణ పొందాలి అని ఆసక్తి ఉన్న యువతులు, మహిళా సోదరీమణులు నన్ను కలసి వివరించినట్టు ఎమ్మెల్యే అన్నారు.  ఈ అంశం ఎస్సీ కార్పొరేషన్  ఈడి తో చర్చించి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.


గత ప్రభుత్వంలో శిక్షణ ఇచ్చి కూడా వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేయకపోవడంతో  అవి మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగిందన్నారు.


ప్రత్యేకంగా ప్రభుత్వ ఉన్నత అధికారులకు వాస్తవాలు వివరించి  వారికి  సైతం కుట్టు మిషన్లు పంపిణీకి ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.


భవిష్యత్తులో ఎస్సీ కార్పొరేషన్ నుండి ఎలాంటి పథకాలు వచ్చిన అర్హులైన వారికి అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.