అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం మంత్రి శ్రీధర్ బాబు !

J . SURENDER KUMAR,

జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
మంగళవారం ఐడి ఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, తో కలిసి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం అధికారులతో నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం అని ఎల్లపుడు ప్రజలకు  అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక గా చేపట్టిన ఇందిర ఇల్లు అర్హులైన నిరుపేదలకు చెందాలని పూర్తిస్థాయిలో అధికారులు విచారణ జరిపి అనారులను గుర్తించి తొలగించాలని అన్నారు.


👉 తొందరపడి తప్పులు చేయొద్దని, రేషన్ కార్డుల జారీ చేసేందుకు విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.   సన్న బియ్యం పంపిణీలో క్వాలిటీ,
క్వాన్టిటీ ఉండాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.


👉 అక్రమాలకు పాల్పడితే ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా 6ఏ కేసు నమోదులు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు గురించి మాట్లాడుతూ మంత్రి, ఎమ్మెల్యే లు చెప్పినా పైరవీలకు అవకాశం లేకుండా నిరూపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు.


👉 భూ భారతి రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని తెలిపారు. ఎలాంటి దరఖాస్తులు ప్రజల నుండి వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న చౌక దుకాణాలు భర్తీ చేయాలని సూచించారు.  రాజీవ్ యువ వికాసం పథకంలో పాడి గేదెల యూనిట్లు  ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి,
ఎస్పి కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డిఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.