అధికారుల సమిష్టి సహకారంతో సక్సెస్ అవుదాం!

👉 జగిత్యాల కలెక్టర్ బి సత్యప్రసాద్ !

👉 కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి @ నేటికీ సంవత్సరం!

J.SURENDER KUMAR,

అధికారులందరి సమష్టి కృషితో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ క్షేమఫలాలు అందించడంలో జిల్లాను ముందు  వరసలో ఉంచుదామని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ గా బి. సత్య ప్రసాద్ బాధ్యతలు చేపట్టి సోమవారానికి  విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో   జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్ కు జిల్లా ఉన్నత అధికారులు, కలెక్టరేట్, వివిధ శాఖల ఉద్యోగులు  పుష్పగుచ్చాలు అందజేశారు. ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ
ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సహకారంతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల  ను పరదర్శకంగా అమలు చేస్తున్నామని అన్నారు భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో అధికారులు  పని చేయాలన్నారు. సమన్వయము తో అధికారులతో పని  చేయాలన్నారు

అదనపు కలెక్టర్ బి. ఎస్. లత మాట్లాడుతూ కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తన మెళకువలు, త్రికరణ శుద్ధి, ఏకాగ్రత, ప్రతి పనిలోనూ నిర్దిష్టంగా ఆలోచించి నిర్ణయాలు  తీసుకోవడంలో  కనబరిచిన ప్రతిభ కారణంగానే జిల్లా అభివృద్ధి పథంలో వెళుతున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, కోరుట్ల ఆర్డిఓ జీవాకర్ రెడ్డి, డి ఆర్ డి ఓ రఘువరన్, ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, డిపిఓ మదన్ మోహన్, ఇండస్ట్రియల్ ఎం.జి యాదగిరి కలెక్టరేట్ ఏవో హకీమ్ పాల్గొన్నారు.