👉 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !
J.SURENDER KUMAR ,
ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. స్థానిక బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ధ్యాన మందిరం బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ..
నిర్మాణం చివరి దశకు చేరుకున్న సందర్భంగా కొద్ది రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో మంచి రోజును పురస్కరించుకొని పుణ్యావాచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వీధి కుటుంబ సభ్యునిగా తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు.
బ్రాహ్మణులలో చాలామంది నిరుపేదలు ఉన్నారని వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ధ్యాన మందిరం ఉపయోగము ఉంటుందని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

కార్యక్రమంలో మోతే ఉమాకాంత్ శర్మ ,సిరిసిల్ల శ్రీనివాస్, మందిరం భారవి శర్మ ,మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, చంద్రశేఖర్, శ్రీధర గణపతి , పార్థసారథి శర్మ ,వేణుగోపాల్ ,శ్రీనివాస్, కార్తీక్, కిరణ్, ఈవో సురేందర్, వార్డు నాయకులు అనుమల్ల రఘు, శ్రీనివాస్ చారి ,భాస్కర్ శర్మ రాజేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.