J.SURENDER KUMAR,
మీరు అధైర్య పడకండి, ప్రభుత్వపరంగా నిబంధనల మేరకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకుంటానని మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపెల్లి గ్రామంలో మంగళవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ఘాతంతో దాదాపు 52 గొర్రెలు మృతి చెందాయి.

సమాచారం తెలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి బుధవారం రాత్రి గొర్రెల కాపరి కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.