J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈనెల 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మణ్ కుమార్, శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.
శనివారం రాత్రి కాంగ్రెస్ అగ్ర నేతలను మర్యాదపూర్వకంగా కలవడానికి ఢిల్లీ వెళ్లారు.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ను కలిసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ , ఆయనను శాలువాతో సన్మానించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.

మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, అధ్యక్షుడు ఖర్గే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తదితర నేతలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపడానికి అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం.