బాలిక పై అత్యాచారం కేసులో 20 సంవత్సరాలు జైలు శిక్ష !

J.SURENDER KUMAR,

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష ₹ 3900/- జరిమాన విధిస్తూ న్యాయమూర్తి సుగాలి నారాయణ శుక్రవారం సంచలన తీర్పునిచ్చారు.

👉 వివరాలు ఇలా ఉన్నాయి…

జగిత్యాల జిల్లా రాయికల్  పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్  బాలికను, నిందితుడు సామల్ల అరవింద్ వయస్సు 28 సంవత్సరాలు అనే నిందితుడు అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.


పోలీసు అధికారులు  ఆధారాలు సమర్పించగా పి.పి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టగా,సాక్షులను విచారించిన  న్యాయమూర్తి సుగాలి నారాయణ నిందితుడికి
శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

👉 ఈ సందర్బంగా ఎస్పి  మాట్లాడుతూ … 

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ  జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.


పై కేస్ లో నిందితునికి  శిక్ష పడటం  పడటం లో కృషి చేసిన పీపీ మల్లేశం, సర్కిల్ ఇన్స్పెక్టర్ Y.కృష్ణకుమార్, CMS  ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ నరేష్   మరియు CMS కానిస్టేబుల్స్ కిరణ్ లను  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ప్రత్యేకంగా  అభినందించారు.