👉 శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు శ్రీహరిలు!1
J.SURENDER KUMAR
ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ వయోవృద శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీహరి, వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొని మంత్రి లక్ష్మణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈనెల 8న మంత్రిగా లక్ష్మణ్ కుమార్, ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

ఆలయాల అర్చకులు, వేద పండితులు, మంత్రి చాంబర్ లో వేదమంత్రాలతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ , ధర్మపురి , జగిత్యాల, చొప్పదండి ,పెద్ద పెళ్లి ,గోదావరిఖని, తదితర నియోజకవర్గల నుండి కాంగ్రెస్ శ్రేణులు నాయకులు, మంత్రి లక్ష్మణ్ కుమార్, అభిమానులు అనుచరులు, తరలి రావడంతో సెక్రటేరియట్ మొదటి అంతస్తు ప్రాంగణం పోటెత్తింది. పోలీస్ అధికారులు జోక్యం చేసుకొని అభిమానుల రద్దీని క్రమబద్ధీకరించారు.
