భూ సమస్యలపై రైతుల దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేస్తారు !

👉 ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల ప్రతి దరఖాస్తును రిజిస్టర్లో నమోదుచేసి అధికారులు పరిశీలిస్తారని  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొనీ, సదస్సుకు వచ్చిన రైతుల ప్రజల  భూ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొన్నారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.

.
రైతులు, ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తదుపరి సమస్యల పరిష్కారానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే అన్నారు.


ప్రజలు రెవెన్యూ సదస్సులలో తమ భూ సమస్యలు ఏమి ఉన్న  దరఖాస్తు చేసుకోవచ్చునని, భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందే భూ భారతి చట్టమని, అందులో భాగంగా బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు.  ప్రజలు ఇట్టి రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.

👉 పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం !

ధర్మపురి మండలం నక్కలపేట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫీల్డింగ్ స్టేషన్ ను
అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.