భూపాలపల్లి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన !

J.SURENDER KUMAR,

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జూన్ 17వ తేదీ. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నందున సోమవారం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చెన్నాపూర్ లో ఏర్పాట్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారని తెలిపారు.

👉 ఉదయం 8 గంటలకు హైదరాబాదులోని బేగంపేట్‌ ఉన్న ప్రజా భవన్ నుంచి ప్రయాణమై  ఉదయం 11 గంటలకు భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలంలోని చెన్నాపూర్ గ్రామానికి చేరుకుంటారని తెలిపారు.
👉 అక్కడ అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారన్నారు.

👉 11:10 – 11:40 గంటల మధ్య చెన్నాపూర్ గ్రామంలో నిర్మితమైన 33/11 కె.వి. ఉపస్టేషన్‌ను ప్రారంభిస్తారని,  అనంతరం 11:40 గంటలకు చెన్నాపూర్ నుంచి మంజూర్ కు ప్రయాణం అవుతారని అన్నారు.


👉 మధ్యాహ్నం 12 గంటల నుండి 12:45 గంటల వరకు
మంజూర్ నగర్, భూపాలపల్లి మండలం, నవాబుపేట, చిట్యాల మండలం,  ధర్మారావుపేట, ఘనపూర్ మండలంలో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్లుకు శంకుస్థాపన  చేయనున్నట్లు  తెలిపారు.

👉 12:45 – 01:30 గంటల వరకు మంజూరు నగర్ లో జరిగే ప్రజాసభలో పాల్గొంటారని అన్నారు.


👉 అనంతరం భోజన విరామం ఉంటుందని 02:30 – 04:00 గంటల వరకు కెటీపీపీ గెస్ట్ హౌస్‌లో సింగరేణి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు.


👉 సాయంత్రం 4:00 గంటలకు జయశంకర్ భూపాలపల్లి నుండి ఖమ్మం జిల్లా ప్రయాణమవుతారని  రాత్రి 7:30 గంటలకు ఖమ్మం చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారని తెలిపారు.


👉 ఉప ముఖ్యమంత్రి  జిల్లాలో జరుగుతున్న విద్యుత్, పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారని ఆయా శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు