బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం !

J.SURENDER KUMAR,

శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం ఆహ్వానించారు.

జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, అర్చకులు కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కి ఆహ్వాన పత్రికను అందించారు.

ఈ సందర్భంగా మహంకాళి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు.