👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన అవినీతి పై ఎందుకు విచారణ జరిపించలేదని
ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
ధర్మారం మండలంలో సోమవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ వివిధ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సిబిఐ, ఈ. డి విచారణ సంస్థలు ఉన్నాయి కదా గత ప్రభుత్వంలో కాళేశ్వరం , ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని, మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
ఏదో వచ్చాము కదా, ఏదో ఒకటి మాట్లాడాలి అనే విధంగా అమీషా ఆరోపణలు ఉన్నాయ. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం మినహా మరేమీ కాదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 నష్టపరిహారం పంపిణీ :

ధర్మారం మండలంలో గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు చామనపల్లి, బొమ్మరెడ్డిపల్లి గ్రామాలకు సంబంధించిన గొర్లకాపర్ల గొర్రెలు మృతి చెందాయి. గొర్ల కాపరులకు ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన నష్టపరిహారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో కలిసి బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.
👉 ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ :

నంది మేడారం గ్రామాల్లో 80 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రొసీడింగ్స్ అందజేశారు.
అనంతరం ₹ 65 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణానికి,₹ 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

అర్హులైన ప్రతి పేదవారికి లబ్ధి చేకూరే విధంగా రాహుల్ గాంధీ ఆదేశాలు,సూచన మేరకు సన్నబియ్యం పంపిణీ, రెండు వందల ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, ₹ 500/- గ్యాస్ సిలిండర్లు రేషన్ కార్డుల జారీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.
గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారా ? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, అని అన్నారు.


ఈ సందర్భంగా మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ను గతమాల తో డోలు వాయిద్యం, నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతించారు.
