సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు !

J.SURENDER KUMAR,

ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని ఆదివారం  సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో మరి మర్యాదపూర్వకంగా కలిశారు.


విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, కృషిని డాక్టర్ దత్తాత్రేయుడు అభినందించారు.

రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్ సీఎం రేవంత్ రెడ్డికి  తెలిపారు.