J.SURENDER KUMAR,
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
ఆదివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను సీఎం రేవంత్ రెడ్డి భుజం తట్టి అభినందించారు.