J.SURENDER KUMAR,
తెలంగాణ కేడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముఖ్యమంత్రి , బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి ని కలిసిన సౌరభ్ శర్మ , సలోని ఛబ్రా , హర్ష చౌధరి, కరోలిన్ చింగ్తియన్మావి, కొయ్యడ ప్రణయ్ కుమార్ ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు.

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో గురువారం జరిగిన ఈ భేటీలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , Dr. MCRHRD వైస్-ఛైర్‌పర్సన్ శాంతి కుమారి , కోర్సు డైరెక్టర్ ఉషారాణి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.