కాంగ్రెస్ ప్రభుత్వం లోనే రోళ్ళ వాగు ప్రాజెక్టుకు మోక్షం !

👉 మాజీ మంత్రి జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR,

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడంతోనే రోళ్ళ వాగు ప్రాజెక్టుకు మోక్షం వచ్చినట్టు కనిపిస్తుంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.


ఆదివారం  రోళ్ల వాగు ప్రాజెక్టు పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకనాడు ఇది రాజుల చెరువు  రాజుల చేరువుగా ఉన్న ఈ బీర్పూర్ , నరసింహుల పల్లె సంబంధించినటువంటి చెరువును శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా చేపట్టబడే విధంగా ధర్మపురి మండలం చివరి వరకు చిత్రవేని గూడెం గాని చర్లపల్లి కండ్లపల్లి రంగసాగర్ తుంగూరు కొల్వాయి చివరి గ్రామాల వరకు నీరు అందింప చేయబడే విధంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూపొందించబడినది అన్నారు.


రోళ్లవాగు అప్పుడు .25 టీఎంసీ తో రూపొందించారు, వాస్తవంగా  సీజన్ లో నీటి విడుదల ఆన్ & ఆఫ్ సిస్టమ్ కాబట్టి మనకు .25 టీఎంసీ స్టోరేజ్ నిలువలను విడుతల వారిగా నీరు నింపుకోని మనం సాగు జరుగుతుండేదని జీవన్ రెడ్డి అన్నారు.


  గత ప్రభుత్వం ఈ .25 టీఎంసీ ఉన్న నీటి నిలువను 1 టీఎంసీగా దాన్ని పెంచే విదంగా ఈ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ కార్యక్రమాన్ని ఆనాడు ₹ 60 కోట్లతోని తెరపైకి తేవడం జరిగింది అన్నారు.


రోళ్లవాగు ప్రాజెక్ట్ అదునికరణ తెరమీదకు రావడం జరిగిందో ఈ బీర్పూర్ మండల వాస్తవ్యులు ధర్మపురి ప్రాంతం వారికి కష్టాలు మొదలు అయినాయని అన్నారు


గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గతంలో ఒకసారి బండ్ బ్రీచ్ అయిపోతే కింద వందలాది ఎకరాలు ఇసుక మెటల్ వేశాయి ఇసుక మెటల్ వేసి మన పంటను నష్టపోవడంతో పాటుగా భూములు అన్నీ కూడా ఇసుక తోడైయడం కూడా పెద్ద సమస్య అయింది అని అన్నారు


.నేడు ఆ పరిస్థితి తిరిగి తలఎత్తకుండా ఈ రోళ్లవాగు ప్రాజెక్టును పూర్తిస్థాయి లోపల పూర్తి చేసే విధంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకుపోవడం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తీసుకుపోవడం జరిగింది అన్నారు. ఆనాడు ₹ 60 కోట్లతో రూపొందింపబడిన అంచనా ₹ 152 కోట్లకు పెరిగింది అని ఆరోపించారు.


ఇందులో ల్యాండ్ ఆక్యువేషన్ ఉంది గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయం లోపించి ఈ అదనంగా ముంపుకు గురి జరిగేటువంటి నీటి సామర్థ్యానికి తగు అటవి భూమికి కావలసినటువంటి రెవెన్యూ భూమి సబ్స్టిట్యూట్ ఇవ్వడం లోపల కార్యచరణ రూపొందించక పోవడంలో కూడా జాప్యం జరిగింది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు.