👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను సన్మానించిన అర్చకులు వేద పండితులు !
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న మతపర ఉద్యోగుల ( అర్చకులు వేద పండితుల ) జీతాలను దేవాదాయ శాఖ భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు ఆనందపడుతున్నారు.
తమ అభ్యర్థన పట్ల స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ స్పందించి ప్రభుత్వంతో చర్చించి జీతాలు పెంచిన నేపథ్యంలో ఆదివారం క్యాంపు కార్యాలయంలో అర్చకులు వేద పండితులు, ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జీతాలు పెంపుదలకు మంత్రులు, అధికారులను వేడుకున్న గత 12 సంవత్సరాలుగా తమ అభ్యర్థన వారు పట్టించుకోలేదని, జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు,

2015 సంవత్సరంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికను నియామకం జరిగిన వారి జీతాలు పెంచుతూ దేవాదాయ శాఖ లేఖ సంఖ్య L.Dis.No.B1/16543/2022, తేదీ 28/05/2025 న అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి ఉత్తర్వులు జారీ చేశారు.

👉 జీతాల వివరాలు :,
👉 బొజ్జ రాజగోపాల్ శర్మ ₹ 8,100 /- నుంచి పెరిగిన జీతం ₹ 20, 000/-
👉 నంబి అరుణ్ కుమార్ ₹ 8,100 /- నుంచి పెరిగిన జీతం ₹ 20,000/-
👉 సముద్రాల వంశీ ₹ 8,100/- నుంచి పెరిగిన జీతం ₹ 20, 000/-
👉 చిలుక ముక్కు ప్రదీప్ కుమార్, ₹ 7, 500/- నుంచి పెరిగిన జీతం ₹ 20, 000 /-
👉 నేరెళ్ల మోహనా చారి ₹ 8,100/- నుంచి పెరిగిన జీతం ₹ 20, 000 /-
👉 చక్రపాణి కిరణ్ కుమార్ ₹ 8,100 /- నుంచి పెరిగిన జీతం ₹ 20, 000 /-
👉 కొలిచాల మహేష్ బాబు, ( సహాయ పాచకులు ) ₹ 8,100/- నుంచి పెరిగిన జీతం ₹ 15, 000 /-
👉 సముద్రాల సంతోష్ కుమార్, ( పాచకులు )
₹ 6, 000 /- నుంచి పెరిగిన జీతం ₹ 20, 000 /-
👉 Ch నవీన్ కుమార్, ( పరిచారకులు )
₹ 4, 000/- నుంచి పెరిగిన జీతం ₹ 10, 000/-
ఇది ఇలా ఉండగా గత నెల రోజుల క్రితం దాదాపు 20 మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జీతాలు పెంచిన విషయం తెలిసిందే.