ధర్మపురి ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి!

👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి  పెండింగ్ నిర్మాణ పనులు త్వరగా తిను పూర్తి చేయాలి అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.

ధర్మపురి మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం మరియు మాతా శిశు ఆరోగ్య కేంద్రం  భవన నిర్మాణ  పనులపై శుక్రవారం  కలెక్టర్ సత్యప్రసాద్ప పరిశీలించారు.


సామాజిక ఆరోగ్య కేంద్రంలోని 50 పడకల గదులను 100 పడకల గదులుగా మార్చిన భవనం నిర్మాణ పనులను పూర్తికాని పెండింగ్ పనులపై వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మాతా శిశువు  ఆరోగ్య కేంద్రం నూతన ఏర్పాటుచేసిన 50 పడగల భవన నిర్మాణ పనులను పరిశీలించారు పూర్తికాని పనులు ఉన్నట్లయితే వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు కాంపౌండ్ వాల్ విద్యుత్తు  ప్లంబింగ్ లాంటివి  పనులు ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు

కలెక్టర్ వెంట ధర్మపురి ఇన్చార్జ్ తహసిల్దార్ సుమన్ ఎంపీడీవో మరియు  ఆర్ ఎం ఓ  రామకృష్ణ రెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు.