ధర్మపురి కళాశాల ఫార్ములా రాష్ట్రంలో అమలుకు శ్రీకారం?

👉 విప్ లక్ష్మణ్ కుమార్, కళాశాల తెరిపించడానికి ప్రతిపాదించిన విధానం తో.!

👉 యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన సారాంశం !


J.SURENDER KUMAR,

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ తెలుగు కళాశాల తిరిగి పునః ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వానికి వివరించి  కళాశాలను తిరిగి ప్రారంభించిన ఫార్ములాను  ప్రభుత్వం యాదగిరిగుట్ట లో అమలకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.

👉 ఇదే ఫార్ములా ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురంలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ కార్యక్రమంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగ సారాంశం ఇది..
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధ్వర్యంలో వైద్య కళాశాల, విద్యాసంస్థలు, యూనివర్సిటీ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం బహిరంగ సభలో ప్రకటించారు.

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

ధర్మపురి క్షేత్రంలో 1966 లో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర తెలుగు కళాశాల 2020 వరకు వేలాదిమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు.  తెలుగు, సంస్కృత పండితులు గా, యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు గా,  ప్రిన్సిపల్స్ గా కొనసాగారు,  కొనసాగుతున్నారు.

👉 బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు కేటాయించక బోధన సిబ్బంది నియామకాలు చేయకపోవడంతో   కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయి మూత పడింది.

👉 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ , తెలుగు కళాశాలను తిరిగి పున ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. బోధన  సిబ్బంది నియామకానికి నిధుల సమస్య గూర్చి  విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తో పలు దపాలుగా చర్చించారు.

👉 బోధనా సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఓ ఫార్ములాను వారికి వివరించారు. ప్రముఖ ఆలయాలైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి తదితర ఆలయాల నుండి ప్రతి సంవత్సరం ఈ కళాశాలలో బోధనా సిబ్బందికి జీతభత్యాల కు కొంత మొత్తం కేటాయించాలని, చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి అనుమతి ఇచ్చింది.

👉 దీంతో నిధులు లేక మూతపడిన ధర్మపురి తెలుగు కళాశాల తిరిగి పున ప్రారంభించబడింది. కళాశాల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి కొన్ని లక్షలు కేటాయించి మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ పొందారు. బోధనా సిబ్బంది నియామకం జరిగింది.

👉 బహుశా ఇదే ఫార్ములాతో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో  వైద్య కళాశాల, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం స్వీకారం చూసినట్టు సమాచారం.