J SURENDER KUMAR,
11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ధర్మపురి పట్టణంలో వివిధ ప్రదేశాలలో శనివారం యోగ కార్యక్రమం వైభవంగా జరిగింది.
👉 కోర్టులో ప్రాంగణంలో …

ధర్మపురి కోర్టు ఆవరణలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జడ్జి యేగి మాట్లాడుతూ మనిషి మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి ‘యోగా’ ఎంతగానో దోహదం చేస్తుందని అని అన్నారు.
👉 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ..

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఏసీ ఫంక్షన్ హాల్ ఆవరణలో
దామెర జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
యోగ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ దామెర రామ సుధాకర్ రావు మాట్లాడుతూ ..

రోజు 24 గంటలో కనీసం ఒక గంట నైనా యోగ చేసి మన శరీరాన్ని మన మానసిక స్థితిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
యోగా కార్యక్రమాన్ని ప్రపంచంలో 172 దేశాలు జరుపుకోవడం చాలా గర్వకారణం, ప్రపంచానికి నరేంద్ర మోడీ యోగాను తెలియజేయడం జరిగింది, యోగా ను 172 దేశాలు మద్దతు ఇస్తూ ఈరోజు యోగ దినోత్సవం జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణం అని అన్నారు.

👉 స్టార్ హెల్త్ ఆధ్వర్యంలో..
యోగా దినోత్సవ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఏసీ ఫంక్షన్ హాల్ ఆవరణలో

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ముత్యపు రమేష్, ఉచిత వైద్య శిబిరం యోగ అభ్యసకులకు గుండె స్కానింగ్ 2D, ECHO,
BP షుగర్& ECG, షుగర్ పరీక్షలు నిర్వహించారు.
దాదాపు ₹ 3 వేల రూపాయల పరీక్షలు చేశారు. వైద్య శిబిరం సాయంత్రం వరకు జరిగింది.

👉 జూనియర్ కళాశాల మైదానంలో..

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో భారీ సంఖ్యలో వాకర్స్ యోగ నిర్వహించారు.