J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో ఆదివారం పాలెపు నరహారి కౌసల్య ఎ/సి ఫంక్షన్ హాల్ లో యశోద హస్పిటల్స్ (సామాజిగూడ) వారి సౌజన్యంతో శ్రీ అన్నపూర్ణ సేవసమితి వారి సహాకారంతో “ఉచిత క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలు” నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా..
ప్రముఖ వైద్య నిపుణులు Dr. శ్రీహరి గౌడ – (క్యాన్సర్ స్పెషలిస్ట్ ) మాట్లాడుతూ..

ఆధునిక జీవన విధానంతో ప్లాస్టిక్ వినియోగంతో, గుట్కా, తంబాకు, మందు మరియు సిగరేట్ వంటి దుర్వసనాలతో – ఈ కాలంలో చాల మందికి క్యాన్సర్ రావడం జరుగుతుంది. ఆ కాన్సర్ను మొదటిలోనే తెలుసుకుంటే Patientకు ఇబ్బంది లేకుండా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


కాన్సర్ గురించి అవగాహణ కార్యక్రమం అనంతరం Dr. శ్రీహరి గౌడ ను వైద్యులను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల, బిజెపి రాష్ట్ర నాయకుడు దామెర రామ్ సుధాకర్ రావు, నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

దామెర రాంసుధాకర్ రావు, చైర్మెన్ దామెర జయలక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్,అప్పాల సత్యవర్థన్ (బిల్డర్), చెన్నూర్, పాలెపు నరహారి కౌసల్య ఎ/సి ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఆర్థిక సహాయం అందించారు.

పాలెపు గణేష్ ,పాత రవిశంకర్ , పెద్దంభట్ల పెద్ద నరేందర్, కాసర్ల వెంకటరమణ లు కార్యక్రమాన్ని నిర్వహించారు ఉచిత శిబిరంలో దాదాపు వంద మంది కి వైద్య పరీక్షలు నిర్వహించారు.