ధర్మపురి నరసింహుడి హుండీ ఆదాయం71 లక్షలు !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మపురిలో గల హుండీల ఆదాయం ₹ 71, లక్షల 53 వేల 190/-వచ్చిందని  కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.


గురువారం ఆలయ ప్రాంగణంలో హుండీల లెక్కింపు జరిగింది 98 రోజులకు సంబందించినవి  (21-03-2025 నుండి 26-06-2025 వరకు) విప్పి లెక్కించగా మొత్తం ఆదాయము ₹ 71,53,190/-లతో పాటు  మిశ్రమ బంగారము 68 గ్రాములు, మిశ్రమ వెండి 7 కిలోల 400 గ్రాములు మరియు విదేశి నోట్లు (32) లభించినట్టు ఈవో తెలిపారు.


.లెక్కింపు కార్యక్రమములో , సహాయ కమీషనర్, ఎన్ సుప్రియ, దేవాదాయశాఖ, కరీంనగర్,  తిరుమల సేవా గ్రూప్ , కరీంనగర్ మరియు ధర్మపురి, లక్షేటిపేట సేవకులు, ఇతరులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మేనేజర్ & సిబ్బంది. పోలీస్ సిబ్బంది మరియు దేవస్థాన అర్చకులు & సిబ్బంది, భక్తులు పాల్గోన్నారు.