J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ , శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంకష్ట చతుర్థి సందర్భంగా శివాలయంలోని శ్రీ ఈశాన్య గణపతి కి అభిషేకం ప్రత్యేక పూజాది కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు.


👉 కాన్వాయ్ రూటు మార్చి..
ధర్మపురి లోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కాన్వాయ్ రూటు మార్చి అంబేద్కర్ చౌరస్తా , పుష్కర స్తూపం, బస్టాండ్ ( గాంధీ చౌరస్తా) నందిని విగ్రహం మంచి మంత్రి కాన్వాయ్ ఆలయానికి చేరుకుంది.
శనివారం వారసంత జరుగుతున్న నేపథ్యంలో పుష్కర స్తూపం నుండి నంది విగ్రహం వరకు చిరు వ్యాపారులు రోడ్డు రహదారి ఇరువైపులా డేరాలు వేసుకొని అమ్మకాలు కొనసాగిస్తారు.
వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి లక్ష్మణ్ కుమార్ రూట్ క్లియరెన్స్ పెట్రోలింగ్ పోలీస్ పార్టీని ఆదేశించి, తన కాన్వాయ్ రూట్ మార్చుకుని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆలయానికి చేరుకున్నారు.